Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

వార్త 1 week ago

LAW CET 2026 Results: తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ (TG LAWCET 2026), పీజీఎల్‌సెట్ (TG PGLCET 2026) ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలు గురువారం (జూన్ 4) అధికారికంగా విడుదలయ్యాయి.

హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ఈ ఫలితాలను లాంఛనంగా విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ lawcet.tgche.ac.inను సందర్శించి, తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలతో పాటు స్కోర్ కార్డులను కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 TG PGLCET 2026

Read also:Aviation jobs for women: ఏవియేషన్ లో మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు

లా కాలేజీల్లో అడ్మిషన్లు.. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు

ఈ ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ లా కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. దీని ద్వారా మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ (3 Years LLB), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (5 Years LLB), అలాగే రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు దక్కనున్నాయి. ఈ ఏడాది మే 18వ తేదీన హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఈ టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha