Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టికెట్ ధరలు పెంచిన SRH.. యాజమాన్యంపై నెటిజన్ల ఆగ్రహం

టికెట్ ధరలు పెంచిన SRH.. యాజమాన్యంపై నెటిజన్ల ఆగ్రహం

వార్త 6 days ago

SRH ticket prices: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఊహించని షాక్. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగబోయే రాబోయే మ్యాచ్‌ల టికెట్ ధరలను ఆకస్మికంగా రెట్టింపు చేయడంతో మధ్యతరగతి క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

RCB తో జరగబోయే మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ క్రేజ్ కారణంగా భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ప్లే ఆఫ్స్‌లో టాప్-2 స్థానం కోసం హోరాహోరీ పోరు నడుస్తుండటంతో, ఇదే అదనుగా భావించి సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ టికెట్ల ధరలను విపరీతంగా పెంచేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.

Read Also : SRH vs CSK: చెన్నైలో నేడు SRH, CSK ఫైట్.. వర్షం పడే ఛాన్స్?

 IPL ticket prices double.. Netizens angry at SRH management

SRH ticket prices: నిమిషాల్లోనే సోల్డ్ అవుట్

మరోవైపు, అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో టికెట్లు అమ్మకానికి ఉంచిన కొద్ది నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అని చూపించడంపై కూడా అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమైన క్రికెట్ ప్రేమికులకు టికెట్లు దొరకడం లేదని, కావాలనే బ్లాక్ మార్కెట్‌లో వీటిని దొడ్డిదారిన అధిక ధరలకు అమ్ముకుంటున్నారని నెటిజన్లు స్క్రీన్ షాట్లతో సహా సోషల్ మీడియాలో కడిగిపారేస్తున్నారు.

సన్‌రైజర్స్ యాజమాన్యం దోపిడీకి నిరసనగా ట్విట్టర్ (X) వేదికగా అభిమానులంతా ఏకమయ్యారు. ప్రస్తుతం నెట్టింట #BoycottUppalMatch అనే హ్యాష్‌ట్యాగ్ మార్మోగిపోతోంది. టికెట్లు కొనడం ఆపేసి స్టేడియాన్ని ఖాళీగా ఉంచడం ద్వారా ఫ్రాంచైజీకి బుద్ధి చెప్పాలని ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. యాజమాన్యం ధరలను తగ్గించకపోతే నిరసన సెగ తప్పదని అభిమానులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

CSK ఫ్యాన్స్‌కు షాక్.. చివరి హోమ్ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha