Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నైలో నేడు SRH, CSK ఫైట్.. వర్షం పడే ఛాన్స్?

చెన్నైలో నేడు SRH, CSK ఫైట్.. వర్షం పడే ఛాన్స్?

వార్త 1 week ago

SRH vs CSK: చెన్నై మైదానంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య కీలక పోరు జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోవడానికి రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది.

అయితే, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు వాతావరణ నిపుణులు ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో చెన్నైలో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Read Also : IPL 2026 Playoffs Race: ప్లే ఆఫ్స్ రేసులో ఏడు జట్ల మధ్య రసవత్తర పోరు

 SRH, CSK fight in Chennai today.. Chance of rain?

టాస్ సమయానికి వరుణుడి అంతరాయం?

SRH vs CSK: సమాచారం ప్రకారం.. మ్యాచ్ టాస్ పడే సమయానికి, అలాగే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం 6:30 గంటల సమయంలో 36 శాతం వర్షం పడే ఛాన్స్ ఉండగా.. మ్యాచ్ ప్రారంభమయ్యే రాత్రి 7:30 గంటల సమయానికి 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తొలి ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయంలో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, రాత్రి సమయం వర్షం తగ్గుముఖం పడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ కొద్దిసేపు ఆలస్యం కావచ్చు లేదా మధ్యలో కొంత సమయం పాటు అంతరాయం కలగవచ్చు. అయితే, వర్షం తీవ్రత అంత ఎక్కువగా ఉండకపోవచ్చని.. కాబట్టి ఓవర్ల తగ్గింపు గానీ, మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు గానీ లేవు అని స్పష్టం చేశారు.

హోమ్ గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. అయితే ఈ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ అంచనా వేయలేం. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రెండు జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఐపీఎల్ చరిత్రలో 15 ఏళ్ల వైభవ్ సరికొత్త రికార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha