Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"టీమ్ ఇండియా బౌలర్లంటే నాకు ద్వేషం": పాక్ క్రికెటర్

"టీమ్ ఇండియా బౌలర్లంటే నాకు ద్వేషం": పాక్ క్రికెటర్

వార్త 1 month ago

Hassan Nawaz Comments on Indian Bowlers: పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ భారత బౌలర్లను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మంటలు రేపుతున్నాయి.

పీఎస్ఎల్ (PSL) 2026 వేదికగా సాగుతున్న ఈ చర్చ, ఇరు దేశాల మధ్య ఉన్న క్రీడా వైరాన్ని మరోసారి హీటెక్కించింది.

Read Also:Arshdeep Singh Comments on Vaibhav: "మర్యాద పక్కన పెట్టి బాదేశాడు": అర్ష్‌దీప్ క్రేజీ కామెంట్స్

Hassan Nawaz Comments on Indian Bowlers: వివాదం ఏంటి?

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో హసన్ నవాజ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.”టీమ్ ఇండియా బౌలర్ల పట్ల నాకు వ్యతిరేకత ఉంది. నిజం చెప్పాలంటే భారత బౌలర్లందరినీ నేను ద్వేషిస్తాను” అని బహిరంగంగా ప్రకటించాడు.భారత్‌తో మ్యాచ్ అంటే తనకు అదనపు ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయని, భవిష్యత్తులో వారి బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం వస్తే ఊచకోత కోస్తానని ధీమా వ్యక్తం చేశాడు.అయితే తన బ్యాటింగ్ తీరు బౌలర్ల పేరును బట్టి కాకుండా, మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రన్ రేట్‌ను బట్టి ఉంటుందని వివరణ ఇచ్చాడు.

 India vs Pakistan Cricket Rivalry

హసన్ నవాజ్ ఇప్పటివరకు భారత్ పై ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్ 2025లో జరిగిన ఆ మ్యాచ్లో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ అతని వికెట్ను పడగొట్టాడు.ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో హసన్ మంచి ఫామ్ లో కనిపించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున పది మ్యాచ్లో రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్ కు, చేరుకోలేకపోయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అభిషేక్ శర్మ సెంచరీల వర్షం.. ఆ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha