Dailyhunt
"మర్యాద పక్కన పెట్టి బాదేశాడు": అర్ష్‌దీప్ క్రేజీ కామెంట్స్

"మర్యాద పక్కన పెట్టి బాదేశాడు": అర్ష్‌దీప్ క్రేజీ కామెంట్స్

వార్త 1 week ago

Arshdeep Singh Comments on Vaibhav: ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇంకా సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.

ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ వేసిన ఓవర్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆడిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది.

Read Also:Vinod Kambli: కాంబ్లీ కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారా? కొత్త యాడ్‌పై నెటిజన్ల ఫైర్

Arshdeep Singh Comments on Vaibhav: అర్ష్‌దీప్ వర్సెస్ వైభవ్: మైదానంలో ఒకలా.. బయట మరోలా

మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ చేసిన వీడియోలో అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్‌తో కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో వైభవ్ గురించి అర్ష్‌దీప్ ఇలా అన్నాడు.”వైభవ్ బయట మాట్లాడేటప్పుడు ‘భయ్యా.. భయ్యా’ అంటూ ఎంతో గౌరవంగా పలకరిస్తాడు. కానీ క్రీజులోకి వచ్చాక మాత్రం ఆ మర్యాదను అసలు గుర్తుపెట్టుకోడు. నా ఓవర్లో 35 పరుగులు బాది చుక్కలు చూపించాడు” అని నవ్వుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసిన వైభవ్, 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.

సూర్యవంశీ బ్యాటింగ్ గురించి, జైస్వాల్ చెబుతూ.. "వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి నేను కూడా చాలా చిన్నవాడినే, కానీ అతనితో పోలిస్తే నేను పెద్దవాడిని అంటే ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. అతనిలో ఉన్న ప్రతిభ అసాధారణం" అని జైస్వాల్ అన్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సల్మాన్ ఖాన్‌కు సారీ చెప్పిన రాజస్థాన్ ప్లేయర్.. ఎందుకో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha