Team India T20 Captain: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అతని స్థానంలో యువ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బోర్డు భావిస్తోంది. ఎన్డీటీవీ నివేదికల ప్రకారం.. గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. శనివారం జరగబోయే సెలక్షన్ కమిటీ సమావేశంలో శ్రేయస్ అయ్యర్ కూడా భాగం కానుండటంతో, అతని నియామకం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
TeamIndiaCaptain
Read also: Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ చోటు దక్కేనా?
ఐపీఎల్ 2026 ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్
2023 డిసెంబర్ తర్వాత భారత టీ20 జట్టులో స్థానం కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ఫామ్ చాటాడు. ఆ టోర్నీలో మొత్తం 498 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, అతనికి ఏకంగా జట్టు పగ్గాలు అప్పగించాలని సెలక్షన్ కమిటీ యోచిస్తోంది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో భారత్.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
Team India T20 Captain: ఫామ్ లేమితో సూర్యకుమార్ యాదవ్‌పై పెరిగిన ఒత్తిడి
ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత బ్యాటింగ్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. మెగా టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో సూర్య కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేక 270 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ పేలవమైన గణాంకాల కారణంగానే భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా అతనిపై వేటు వేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
2028 ప్రపంచకప్‌పై సెలక్టర్ల కన్ను.. వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ?
ఈ పరిణామాలపై మాజీ వికెట్ కీపర్ సబా కరీం పీటీఐతో మాట్లాడుతూ.. “ప్రస్తుత ఆటతీరును బట్టి చూస్తే సూర్యకుమార్ యాదవ్ సెలక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో లేకపోవచ్చు. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును నిర్మించే క్రమంలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో జరిగినట్లుగానే ఈ మార్పును సహజంగా చూడాలి” అని విశ్లేషించారు.
మరోవైపు ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కొత్త జట్టులో వైస్ కెప్టెన్ బాధ్యతలను తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు అప్పగించేందుకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్

