Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమ్ఇండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్‌ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!

టీమ్ఇండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్‌ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!

వార్త 1 week ago

Virat Kohli: భారత క్రికెట్ అభిమానులకు భారీ నిరాశ ఎదురైంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత కింగ్ కోహ్లీ మెరుపులను మైదానంలో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది.

అఫ్గానిస్థాన్‌తో త్వరలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తొడ కండరాల గాయంతో బాధపడుతుండటమే దీనికి కారణమని సమాచారం.

Read also: Shreyas Iyer : సూర్యకు షాక్?.. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

 Big shock for Team India.. Virat Kohli ruled out of Afghanistan ODI series!

Virat Kohli: భీకర ఫామ్‌లో ఉన్న వేళ కండరాల గాయం

ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చెలరేగి ఆడారు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 56.25 సగటు, 165.85 స్ట్రైక్‌రేటుతో ఏకంగా 675 పరుగులు సాధించి తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్‌పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇలాంటి కీలక సమయంలో ఆయనకు గాయం కావడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే, కోహ్లీ స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా బీసీసీఐ ఎవరిని ఎంపిక చేయబోతుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ వన్డే సిరీస్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ శర్మను అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ, ఆయన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే తుది జట్టులోకి వస్తారని సెలక్టర్లు ముందే స్పష్టం చేశారు. ఒకవేళ రోహిత్ కూడా దూరమైతే యంగ్ టీమ్‌తోనే భారత్ బరిలోకి దిగాల్సి వస్తుంది.

భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్ షెడ్యూల్:

ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి.

  • తొలి వన్డే: జూన్ 13 - ధర్మశాల
  • రెండో వన్డే: జూన్ 17 - లక్నో (ఏకానా స్టేడియం)
  • మూడో వన్డే: జూన్ 20 - చెన్నై (చేపాక్ స్టేడియం)

ఈ వన్డే సిరీస్‌కంటే ముందు జూన్ 6 నుంచి భారత్, అఫ్గాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుండగా, అందుకోసం ఇప్పటికే టీమ్ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

IPLలో ఫిక్సింగ్? లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha