Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్యకు షాక్?.. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

సూర్యకు షాక్?.. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

వార్త 1 week ago

Shreyas Iyer : భారత టీ20 జట్టులో నాయకత్వ మార్పులపై చర్చ జోరుగా సాగుతోంది. త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ ముందంజ

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. జట్టును విజయవంతంగా నడిపిన అనుభవంతో పాటు ఒత్తిడిని తట్టుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకు అదనపు బలం కావచ్చని భావిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చర్చల అనంతరం సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వైస్ కెప్టెన్సీకి పలువురు పోటీ

ఒకవేళ శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే, తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వొచ్చని సమాచారం. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బలమైన జట్టును పంపాలని బోర్డు భావిస్తోంది.

Read also: ENG vs NZ: తొలి టెస్టుకు ఇంగ్లాండ్ 12 మంది జట్టు ఖరారు

 Shreyas Iyer

వైభవ్ సూర్యవంశీకి అవకాశం?

ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో భారీ పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించిన వైభవ్‌కు ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల్లో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాప్ ఆర్డర్‌లో పలువురు ఆటగాళ్లు ఉన్నప్పటికీ, యువ ప్రతిభను పరీక్షించే దిశగా ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వవచ్చని సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

SRHకు బిగ్ షాక్.. ఐపీఎల్-2027కు పాట్ కమ్మిన్స్ దూరం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha