Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్

వార్త 2 months ago

Tirupati: కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గొయల్ శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రికి ఘన స్వాగతం పలికారు. బీజేపీ నేత గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పియూష్ గోయల్‌కు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించి, దుస్సాలువతో సత్కరించారు.

Read Also : AP Weather update: ఏపీకి భారీ వర్ష సూచన.. గంటకు 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

 Union Minister Piyush Goyal visits Tiruchanur Goddess

Tirupati: పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామికాభివృద్ధిపై మంత్రి పిలుపు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బిజెపి తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బిజెపి తిరుచానూరు నాయకులు విశ్వనాథ్, మనీ, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుమలలో ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ ప్రశంసనీయం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha