Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లిదండ్రులకు తీరని వేదన.. నీటి కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు మృతి

తల్లిదండ్రులకు తీరని వేదన.. నీటి కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు మృతి

వార్త 2 months ago

Roddam Tragedy: రొద్దం మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామంలో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి వివరాలకు వెళ్తే అజయ్ రెడ్డి కల్పన దంపతులకు ఇద్దరు కొడుకులు దరహాసిరెడ్డి (12) హర్షిత్ రెడ్డి (10) ఇద్దరు కొడుకులు శ్రీదేవి కి సృజనా రెడ్డి (11) ముగ్గురు కలిసి గ్రామ సమీపంలో వీర చిన్నయ్య స్వామి గుడి దగ్గర నల్ల నేరేడు పండ్లు చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ నేరేడు పండ్లు తిని పక్కనే ఉన్న నీటి కుంటలో సరదాగా నీళ్లలో ఆడుకుందామని పోవడం జరిగింది కుంటలో నీరు ఎక్కువ ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు నీళ్లలో మునిగిపోవడం జరిగింది విషయం తెలుసుకొని గ్రామస్తులు తల్లిదండ్రులకు విషయం తెలియజేయడం జరిగింది

Read also: Nellore boat accident: నెల్లూరులో నాటు పడవ బోల్తా.. నలుగురు గల్లంతు

 Three children die after falling into a water pit.

Roddam Tragedy: సరదాగా వెళ్లి ప్రాణాలు కోల్పోయారు

ఒకే ఇంటిలో ఇద్దరు మరొక కుటుంబంలో ఒకరు ఉన్న కొడుకులను పోగొట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆవేదన రోధిస్తుంటే గ్రామం మొత్తం కంటతడి పెట్టింది ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఎవరికి రాకూడదని గ్రామస్తులు బంధువులు ఆ తల్లిదండ్రులను ఎంత ఓదార్చిన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి సవిత స్పందిస్తూ చిన్నారుల దుర్మరణం బాధాకరమని బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు తీర్చలేనిది ఒకే గ్రామంలో ముగ్గురు పిల్లలు చనిపోవడం చాలా దురదృష్టకరమని చనిపోయిన పిల్లల కుటుంబాలకు అండగా ఉంటామని సెలవుల దృష్ట్యా చిన్నారుల కదలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నీరు ఉన్న పరిసర ప్రాంతాలకు పిల్లలను వెళ్లకుండా కట్టడి చేయాలని ఈ కష్టాన్ని నష్టాన్ని ఎవరూ పూడ్చలేనని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎంఎ షరీఫ్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha