Dailyhunt
తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ఎప్పుడంటే?

తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ఎప్పుడంటే?

వార్త 3 weeks ago

Tirumala Srivari Vasanthotsavam: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల (మార్చి) 30వ తేదీ నుండి వచ్చే నెల (ఏప్రిల్) 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. స్వామివారికి జరిగే ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

Read Also:Markapuram Road Accident updates: ముగిసిన డీఎన్ఏ పరీక్షలు.. స్వగ్రామాలకు మృతదేహాలు తరలింపు

Tirumala Srivari Vasanthotsavam: మూడు రోజుల ఉత్సవాల పూర్తి షెడ్యూల్

ఈ నెల 30న ఉ.6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా నాలుగు మాడవీధుల్లో మలయప్ప స్వామివారి ఊరేగింపు జరగనుంది. 31న ఉ.8 నుంచి 10 గంటల వరకు మలయప్పస్వామి రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. ప్రతిరోజు మ.2 నుంచి 4 గంటల వరకు అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

భక్తులకు సూచనలు

వసంతోత్సవాల కారణంగా ఈ మూడు రోజుల పాటు తిరుమలలో కొన్ని ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసే అవకాశం ఉంది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా మాడవీధుల్లో భక్తుల కోసం ప్రత్యేక చలువ పందిళ్లు, నీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతి తీర్మానాన్ని స్వాగతించిన షర్మిల..కానీ ఆ సెక్షన్ సంగతేంటని బాబుకు ప్రశ్న

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha