Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో భారీ వర్షాలు.. నిండుకుండలా మారుతున్న జలాశయాలు

తిరుమలలో భారీ వర్షాలు.. నిండుకుండలా మారుతున్న జలాశయాలు

వార్త 1 month ago

Tirumala Water Reservoirs: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో.. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలోని జలాశయాలన్నీ క్రమంగా గరిష్ట స్థాయి నీటిమట్టాన్ని అందుకుంటున్నాయి. దీంతో తిరుమలలోని రిజర్వాయర్లకు చాలినంత నీరు వచ్చి చేరింది.

Chintalapudi Lift Irrigation: నవంబర్‌ నుంచి చింతలపూడి పనులు ప్రారంభం: చంద్రబాబు

 Heavy rains in Tirumala; reservoirs filling up to capacity

Tirumala Water Reservoirs: ఐదు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వల వివరాలు

తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో శుక్రవారం వరకు నమోదైన నీటి నిల్వల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా వెల్లడించింది. ఈ ఐదు రిజర్వాయర్లలో కలిపి మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీటి మట్టం పెరిగినట్లు తెలిపింది. పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార రిజర్వాయర్ల నుంచి ఇప్పటివరకు 21.60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా, ప్రస్తుతం 40.08 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా నిల్వ ఉంది.

ప్రతి డ్యామ్‌కు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుత వివరాలు ఇలా ఉన్నాయి:

  • పాపవినాశనం డ్యామ్: ఈ జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 5,240.00 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 2,688.35 లక్షల గ్యాలన్లుగా నమోదైంది.
  • గోగర్భం డ్యామ్: దీని నిల్వ సామర్థ్యం 2,833.10 లక్షల గ్యాలన్లు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 508.31 లక్షల గ్యాలట్లకు చేరింది.
  • ఆకాశగంగ: ఈ రిజర్వాయర్ సామర్థ్యం 685.00 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 30.40 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది.
  • కుమారధార డ్యామ్: ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 4,259.01 లక్షల గ్యాలన్లు కాగా.. శుక్రవారం నాటికి 363.98 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.
  • పసుపుధార డ్యామ్: ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 1,287.54 లక్షల గ్యాలన్లు కాగా.. వర్షాల వల్ల అదనంగా 24.38 లక్షల గ్యాలన్ల నీరు వచ్చి చేరింది.

మరింత పెరిగే అవకాశం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02 లక్షల గ్యాలన్లు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరినట్లు టీటీడీ పేర్కొంది. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, అది తుఫాన్‌గా మారే పరిస్థితులు నెలకొన్నందున రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తిరుమల జలాశయాల్లో నీటిమట్టం మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

Epaper: epaper.vaartha.com

రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు..ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha