Tirumala Navaratri Brahmotsavam: తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.
Chandrababu Naidu: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
Heavy rush of devotees in Tirumala; 12 hours for Sarva Darshana of Srivari
Tirumala Navaratri Brahmotsavam: ఒక్కరోజే 77,759 మందికి దర్శనం.. హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లు
శుక్రవారం ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 77,759 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకునే క్రమంలో 28,977 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.2.96 కోట్ల ఆదాయం లభించింది.
రాత్రికి వైభవంగా గజ వాహన సేవ!
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి వారు హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఇక నేటి రాత్రి 7 గంటలకు అత్యంత వైభవంగా గజ వాహన సేవ జరగనుంది. భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే ప్రయాణికులు తమ పర్యటనను తదనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

