Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల గరుడ సేవకు ప్రత్యేక రైళ్లు

తిరుమల గరుడ సేవకు ప్రత్యేక రైళ్లు

వార్త 1 week ago

Tirumala garuda seva:తిరుమలలో బ్రహ్మోత్సవాలలో జరిగే గరుడ సేవ దసరా దీపావళి సెలవుల రద్దీని తగ్గించడానికి దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ నుంచి తిరుపతికి తిరుమలలో గరుడ సేవ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ప్రయాణికుల సౌకర్యం కోసమని ఈ నెల 17 నుంచి 20 వరకు మొత్తం 8 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. సాధారణ ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఈ జన్ సాధారణ్ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

Tirumala Garuda Seva: శ్రీవారి గరుడ సేవ.. తిరుమల ఘాట్ రోడ్‌లో బైక్‌లకు నో ఎంట్రీ

ఏ సమయంలో ఏ రైలు ప్రయాణం

ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు రైలు నంబర్ల వివరాలు పరిశీలిస్తే, ట్రైన్ నంబర్ 07251 అక్టోబర్ 17న తిరుపతిలో తెల్లవారుజామున 2:30 గంటలకు బయలుదేరి ఉదయం 9:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే ట్రైన్ నంబర్ 07249 అక్టోబర్ 17 నుంచి 20 వరకు విజయవాడ నుంచి తిరుపతికి 4 ట్రిప్పులు నడుస్తుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 10:00 గంటలకు బయలుదేరి రాత్రి 7:00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మరో వైపు ట్రైన్ నంబర్ 07250 అక్టోబర్ 17 నుంచి 19 వరకు తిరుపతి నుంచి విజయవాడకు 3 ట్రిప్పులు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

Tirumala garuda seva:బోగీల వివరాలు ఆగే ముఖ్య స్టేషన్లు

ఈ రైళ్లలో ప్రయాణ సౌకర్యాలు బోగీల వివరాలు చూస్తే మొత్తం 21 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 19 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు 2 ఎస్ఎల్ఆర్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు ఉంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చిన గంజాం, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, దుగ్గిరాల, పెద్దవాడిపూడి స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని రైల్వే శాఖ కోరుతోంది.

Epaper: epaper.vaartha.com

తిరుమలలో గరుడ వాహనసేవకు భారీ ఏర్పాట్లు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha