Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో రికార్డు స్థాయిలో అన్నప్రసాదాలు

తిరుమలలో రికార్డు స్థాయిలో అన్నప్రసాదాలు

వార్త 3 months ago

Tirumala Annaprasadam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలో అన్నప్రసాద వితరణ సరికొత్త మైలురాయిని చేరుకుంది. మార్చి 21 నుండి మార్చి 27 మధ్య గల వారం రోజులలో ఏకంగా 17.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

గత ఫిబ్రవరి చివరి వారంలో ఈ సంఖ్య 14.96 లక్షలుగా ఉండగా, మార్చి ఆఖరి వారానికి వచ్చేసరికి అదనంగా మరో 2.16 లక్షల మంది భక్తులు పెరగడం విశేషం.

Read also: Uravakonda: సమాచార హక్కు చట్టం కమిషనర్ గాజుల ఆదెన్నకు ఘన సత్కారం

Record-Breaking Distribution of Annaprasadam in Tirumala

Tirumala Annaprasadam: మెనూలో మార్పులు – పెరిగిన ఆదరణ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద నాణ్యతను మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ మేరకు అన్నప్రసాద మెనూలో కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా భోజనంతో పాటు ‘వడ’ను ప్రవేశపెట్టడం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. భోజన వితరణ కేంద్రాల వద్ద రద్దీ పెరిగినా, టీటీడీ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఎక్కడా అంతరాయం కలగకుండా చూస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అమరావతి చట్టబద్ధతపై వెంకయ్య నాయుడు చొరవ: అమిత్ షాతో కీలక భేటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha