Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శ్రీవాణి దర్శనం కరెంట్ బుకింగ్ కోటాను రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపింది.
అక్టోబర్ 3, శనివారం, అక్టోబర్ 4, ఆదివారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.
Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టోకెన్ కష్టాలు
800 శ్రీవాణి టికెట్ల కోటా రద్దు
టీటీడీ సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్ కోటా కింద 500 శ్రీవాణి దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే దాతల కోసం మరో 300 టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రెండు కోటాలను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో క్యూలైన్లలో వేచి ఉండే సమయం కూడా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో అన్నప్రసాదం, తాగునీరు, పాలు, కాఫీ, టీ, మజ్జిగ వంటి సదుపాయాలను అందిస్తోంది. అవసరమైన వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచింది. క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో భక్తులు సంయమనం పాటించాలని సూచిస్తోంది. ఇప్పటికే అక్టోబర్ 1, 5 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపినాథ్‌తో కలిసి పలు శాఖల అధికారులతో ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.
Tirumala Darshan: భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్ల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, సమాచార ఫ్లెక్సీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులకు మార్గనిర్దేశం చేసేలా సూచికలు, ప్రకటనలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, రోజువారీగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. తిరుపతికి కలిసే నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద ఆకర్షణీయమైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకలు ఉండే ప్రాంతాల్లో ప
Epaper: epaper.vaartha.com

