E- Visa Center Sanctioned : తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రంనిత్యం దేశవిదేశాల నుంచి తిరుపతికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
విదేశాల నుంచి వచ్చేవారికి ఈ వీసా ప్రక్రియకు కాస్త ఇబ్బందులు తప్పకపోయేవి. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే విదేశీయులకు పౌరవిమానయానశాఖ శుభవార్త చెప్పింది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం మంజూరైంది.
Read Also: Chia Seeds and Lemon Water: రోజూ ఉదయాన్నే చియా సీడ్స్, నిమ్మరసం తాగితే ఏమవుతుంది?
E- Visa Center Sanctioned
E- Visa Center Sanctioned : కేంద్ర పౌరవిమానయానశాఖ ఉత్తర్వులు జారీ
ఈ మేరకు కేంద్ర పౌరవిమానయానశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ద్వారా తిరుపతికి వచ్చే విదేశీయులకు మేలు జరగనుంది. ఇప్పటివరకు విదేశీ భక్తులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు చేరుకొని ఈ-వీసా ప్రక్రియ పూర్తిచేసుకునేవారు. అనంతరం తిరుపతికి వచ్చేవారు. ఈ-వీసా కేంద్రం సేవలు ప్రారంభమైతే విదేశీ భక్తులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే సదుపాయం ఉంటుంది. రాయలసీయ నుంచి చాలామంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు లేకపోవటంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి ఇది అదనపు భారంగా మారింది. అక్టోబర్ నుంచి రేణిగుంటలో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విమానయానశాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
ఇక ఏపీలోనే పైలట్ కోర్సులు.. 3 విమానాశ్రయాల్లో 6 శిక్షణ కేంద్రాలు మంజూరు!

