Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirupati: లాయర్స్ కాలనీలో నూతన సిసి రోడ్ల ప్రారంభం

Tirupati: లాయర్స్ కాలనీలో నూతన సిసి రోడ్ల ప్రారంభం

వార్త 3 months ago

జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర సమగ్రాభివృద్ధి కోసమే సీసీ రోడ్ల నిర్మాణం

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

లాయర్స్ కాలనీలో సిసి రోడ్లను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యేలు

Tirupati: జిల్లా కేంద్రమైన చిత్తూరును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు.సీసీ రోడ్ల నిర్మాణంతోనే చిత్తూరు నగర సమగ్రాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.చిత్తూరు నగర పరిధిలోని 4వ డివిజన్ లాయర్స్ కాలనీలో 19-30 లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, మురుగు కాలువలను శనివారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రారంభించారు.

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

చిత్తూరు ప్రగతి పై ప్రత్యేక దృష్టి

అంతకుముందు లాయర్స్ కాలనీకి చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలకు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సీసీ రోడ్లు , మురుగు కాలువల ప్రారంభోత్సవ అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రగతి పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇందులో భాగంగానే తాము చిత్తూరు నగర సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలను చేపట్టి దశలవారీగా చేపట్టి పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద ,చూడ ఛైర్పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, టిడిపి సీనియర్ నేత కాజూరు బాలాజీ, టిడిపి రాష్ట్ర మహిళా నేత వై.వి.రాజేశ్వరి , మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజు , మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్, ఆడిటర్ కేశవులు నాయుడు ,టిడిపి నాయకులు గురజాల సురేష్ ,టిడిపి నగరాధ్యక్షులు నరేష్ చౌదరి, ప్రధాన కార్యదర్శి పచ్చప్ప ,కార్పోరేటర్లు ఇందు,టిడిపి వాణిజ్య వివాహ విభాగం అధ్యక్షులు టి ఆర్ జనార్దన్ నాయుడు, వార్డు టిడిపి ఇంచార్జ్ నాగలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Vizag Crime News: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha