Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vizag Crime News: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Vizag Crime News: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

వార్త 3 months ago

Vizag Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో శనివారం ఒక విషాద ఘటన వెలుగు చూసింది. భీమిలి ప్రాంతంలోని ఒక లాడ్జిలో శ్యామ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడు మద్యంలో విషం కలుపుకుని తాగి తన ప్రాణాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.

AI Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

సారీ అమ్మ

అయితే, నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ.. అంటూ రాసిన సూసైడ్ నోట్ లభించింది.. ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా తెలుస్తుంది.. హైదరాబాద్ లో శ్యామ్ కుమార్, పావని మద్య జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది పావని.. అయితే, పావని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నుంచి పారిపోయి విశాఖ వచ్చాడు శ్యామ్ కుమార్.. పావని మృతి చెందందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు..

ఈ నేపథ్యంలోనే మద్యంలో విషం కలుపుకుని శ్యామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగి స్పేర్ కీ తో తలుపులు తీసి చూడగా విగతజీవిగా పడివున్నాడు శ్యామ్ కుమార్.. పోలీసులకు సమాచారం అందించారు లాడ్జి సిబ్బంది.. రెండు సూసైడ్ నోట్లు, ఎలుకల మందు ప్యాకట్లు లభ్యం అయ్యాయి.. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. మృతుడు స్వస్థలం విశాఖలోని పాత పోస్టాఫీస్ ప్రాంతం.. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha