Tirupati Karimnagar Express: పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతికి వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచుతున్న దక్షిణ మధ్య రైల్వే (SCR), పలు రైళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది.
గతంలో వారానికి ఒకసారి (వీక్లీ) నడిచే కొన్ని రైళ్లను రెగ్యులర్ చేయడంతో పాటు అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి – కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12761) బయలుదేరే వేళలను సవరిస్తూ కీలక ప్రకటన చేసింది.
Read Also : Women's Reservation : షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్

Tirupati Karimnagar Express: అక్టోబర్ 10 నుంచి కొత్త వేళలు అమలు
ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 8:05 గంటలకు బయలుదేరుతున్న ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 10వ తేదీ నుంచి రాత్రి 7:50 గంటలకే బయలుదేరనుంది. అంటే ప్రస్తుతం ఉన్న సమయం కంటే 15 నిమిషాల ముందుగానే ఈ రైలు తిరుపతి నుంచి ప్రయాణం కానుంది. మారిన ఈ సమయాలకు అనుగుణంగానే ప్రయాణికులు తమ ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఈ తిరుపతి-కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మార్గం మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. సమయాల మార్పుపై అధికారులు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్తగా రెండు ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి బెంగళూరుకు నడిచే వందే భారత్ స్లీపర్ షెడ్యూల్ దాదాపు ఖరారవ్వగా, సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి మరో వందే భారత్ స్లీపర్ నడిపే అంశంపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
టోల్ ఛార్జీల బాదుడుకు చెక్.. నెలకు రూ.340తో అన్‌లిమిటెడ్ జర్నీ

