Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టోల్ ఛార్జీల బాదుడుకు చెక్.. నెలకు రూ.340తో అన్‌లిమిటెడ్ జర్నీ

టోల్ ఛార్జీల బాదుడుకు చెక్.. నెలకు రూ.340తో అన్‌లిమిటెడ్ జర్నీ

వార్త 2 weeks ago

FASTag Local Pass: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది.

టోల్ ప్లాజాల వద్ద స్థానిక ప్రయాణికులకు ఊరటనిస్తూ ‘ఫాస్ట్ ట్యాగ్ లోకల్ పాస్’ (FASTag Local Pass) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక పాస్ ద్వారా వాహనదారులు ప్రతినెలా తక్కువ రుసుముతో అపరిమితంగా ప్రయాణించే సౌలభ్యం కలగనుంది.

Read Also : Vijay - Sangeetha : విజయ్-సంగీత లు ఒకటైనట్లేనా ? మరి త్రిష సంగతేంటి?

 Put an end to the toll charge burden… Unlimited travel for ₹340 per month.

FASTag Local Pass: రూ.340లకే 30 రోజుల అపరిమిత ప్రయాణం

ఈ నూతన పథకం కింద అర్హులైన ప్రయాణికులు నెలకు కేవలం రూ.340 చెల్లిస్తే సరిపోతుంది. ఈ రుసుముతో 30 రోజుల పాటు సదరు టోల్ ప్లాజా వద్ద ఎన్నిసార్లయినా (అపరిమితంగా) ప్రయాణించవచ్చు. ప్రతిసారి సాధారణ టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా స్థానికులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ ప్రత్యేక పాస్‌కు సంబంధిత టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల వ్యాసార్థం (రేడియస్) పరిధిలో నివసించే స్థానిక నివాసితులు మాత్రమే అర్హులు. ఈ సదుపాయం కేవలం సొంత (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత నిర్ధారణ కోసం వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి)లో నమోదైన చిరునామా, వాహన యజమాని ఆధార్ కార్డులోని చిరునామాతో సరిపోలాలి. ఈ నిబంధనలను పూర్తి చేసిన వారికే పాస్ జారీ చేయబడుతుంది.

అప్లై చేసుకోవడం ఎలా?

ఈ పాస్ పొందాలనుకునే అభ్యర్థులు నేరుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు:

  • ఆన్‌లైన్ విధానం: ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన అధికారిక ‘రాజ్‌మార్గ్ యాత్ర’ (Rajmarg Yatra) మొబైల్ యాప్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రుసుము చెల్లించవచ్చు.
  • ఆఫ్‌లైన్ విధానం: సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు నేరుగా వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి మాన్యువల్‌గా కూడా పాస్ పొందవచ్చు.

రీల్స్ చూస్తూ వంట చేయలేదని భార్యను దారుణంగా చంపేసిన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha