Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి విమానాల షెడ్యూల్ మార్పు.. కొత్త షెడ్యూల్ వివరాలు

తిరుపతి విమానాల షెడ్యూల్ మార్పు.. కొత్త షెడ్యూల్ వివరాలు

వార్త 2 weeks ago

Tirupati Flight Schedule Change: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విమానాల్లో ప్రయాణించే భక్తులకు అధికారులు ముఖ్యమైన గమనిక విడుదల చేశారు. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి వచ్చే పలు ప్రధాన విమాన సర్వీసుల సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు.

నేటి నుంచే ఈ కొత్త వేళలు అమల్లోకి రానున్నందున ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను అందుకు తగినట్లుగా మార్చుకోవాలని సూచించారు.

Read Also : AP PMAY Urban houses: పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు

 Change in Tirupati flight schedule… details of the new schedule.

Tirupati Flight Schedule Change: విమాన సర్వీసుల కొత్త షెడ్యూల్ వివరాలు

ఎయిర్‌లైన్స్మార్గం (రూట్)తిరుపతికి చేరుకునే సమయంతిరిగి బయలుదేరే సమయం
ఇండిగోహైదరాబాద్ - తిరుపతిఉదయం 7:20ఉదయం 8:00
ఇండిగోహైదరాబాద్ - తిరుపతిఉదయం 11:15ఉదయం 11:45
ఇండిగోహైదరాబాద్ - తిరుపతిమధ్యాహ్నం 1:50మధ్యాహ్నం 2:30
ఇండిగోభోగాపురం - తిరుపతిమధ్యాహ్నం 3:30సాయంత్రం 4:00
ఇండిగోఢిల్లీ - తిరుపతిసాయంత్రం 6:25రాత్రి 7:05
ఇండిగోహైదరాబాద్ - తిరుపతిరాత్రి 8:20రాత్రి 9:00
స్టార్ ఎయిర్‌లైన్స్శివమొగ్గ - తిరుపతిమధ్యాహ్నం 12:20మధ్యాహ్నం 12:50
ఎయిర్ ఇండియాహైదరాబాద్ - తిరుపతిసాయంత్రం 5:10సాయంత్రం 6:00

ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు

విమానంలో తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎయిర్‌పోర్ట్‌లోనే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది.

  • రోజువారీ కోటా: ప్రతిరోజూ ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో 200 టికెట్లు జారీ చేస్తారు.
  • టికెట్ విధానం: ‘మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన’ (First Come First Served) ఈ టికెట్లు కేటాయిస్తారు.
  • చార్జీలు: శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10,000 విరాళంతో పాటు, దర్శన టికెట్ ధర రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
  • అవసరమైన పత్రాలు: బోర్డింగ్ పాస్, ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులను కౌంటర్ వద్ద చూపించి టికెట్ పొందవచ్చు. ఈ టికెట్ పొందిన భక్తులు అదే రోజు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది.

హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha