Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి-బెంగళూరు హైవేపై భారీగా దొరికిన గంజాయి.. ఒడిశా కేటుగాళ్ల అరెస్ట్!

తిరుపతి-బెంగళూరు హైవేపై భారీగా దొరికిన గంజాయి.. ఒడిశా కేటుగాళ్ల అరెస్ట్!

వార్త 2 months ago

Chittoor Ganja Case: చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాలను గుర్తించి కట్టడి చేయడం, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించడం, విద్యాసంస్థలు మరియు ప్రజా ప్రాంతాల పరిసరాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసు అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Read Also :Alipiri Street Vendors: వీధి వ్యాపారుల నిరసన ర్యాలీలో భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్!

ఈ నేపథ్యంలోజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ పోలీసు అధికారి J.వెంకటనారాయణ పర్యవేక్షణలో చిత్తూరు రూరల్ వెస్ట్ సి ఐ V.శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో, యాదమరి ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీసు సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ ఆర్. జయంతి కి అందిన కచ్చితమైన సమాచారం మేరకు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీలలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని , ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న కారును తిరుపతి నుండి బెంగళూరుకు వెళ్ళు హైవే యాదమరి మండల పరిధిలోని, వరిగిపల్లి జంక్షన్ నుండి బాన్సె హోటల్ సర్వీస్ రోడ్డు లో కారును తనిఖీ చేయగా, వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టిన 39.6 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Chittoor Ganja Case: ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రం నుండి గంజాయిని అక్రమంగా సేకరించి, ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు తరలిస్తున్నట్లు అంగీకరించారు. అక్కడ కిలో గంజాయిని సుమారు రూ.30 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అక్రమ రవాణా ముఠాలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలడంతో వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి.

నిందితులపై NDPS Act-1985 లోని 20(b)(ii)(b) r/w 8(c)of NDPS Act 1985 సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.మాదక ద్రవ్యాల వ్యాపారంపై ఎలాంటి రాజీ ఉండదని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అరెస్టు చేసిన నిందితులు

దీక్షిత్ సుక్రిత్ (22 సం.లు), తండ్రి సోమనాథ్ సుక్రిత్ @ అర్జున్ సుక్రిత్, బానూర్ గ్రామం, తర్లకోట పోస్టు, ఓర్కల్ మండలం, మాల్కన్‌గిరి జిల్లా, ఒడిశా రాష్ట్రం. మురళీధర్ బురడీ (33 సం.లు), తండ్రి శ్యామ బురడీ, బదేల్ గ్రామం, నందపూర్ తాలూకా, కోరాపుట్ జిల్లా, ఒడిశా రాష్ట్రం. 39.6 కిలోల నిషేధిత గంజాయి (అంచనా మార్కెట్ విలువ రూ.11.88 లక్షలు)కారు, రెండు మొబైల్ ఫోన్లు రెండు నకిలీ నంబర్ ప్లేట్లు మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.16.88 లక్షలు (రూ.11.88 లక్షల విలువైన గంజాయి రూ.5 లక్షల విలువైన వాహనం స్వాధీనం)

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుమలలో భక్తుల ఆహార భద్రత కోసం 1300 మందికి ప్రత్యేక శిక్షణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha