Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘంటసాలకు పుష్పాంజలి!

ఘంటసాలకు పుష్పాంజలి!

వార్త 2 weeks ago

Ghantasala Fans Tribute: తన మధుర గానామృతంతో దశాబ్దాల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ పేర్కొన్నారు.

తిరుపతి నగరంలోని స్థానిక వీవీ మహల్ రోడ్డు (VV Mahal Road) లో ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద సోమవారం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.

Read Also: APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్

ఘంటసాల వెంకటేశ్వరరావుపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలతో ఆయన అభిమానులు ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల ఒకటో తారీఖున వీవీ మహల్ రోడ్డులోని ఘంటసాల విగ్రహాన్ని మంచి నీటితో పవిత్రంగా శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాంజలి ఘటించడం వీరి ప్రత్యేకత. ఇందులో భాగంగానే జూన్ 1వ తేదీ (సోమవారం) నాడు విగ్రహాన్ని శుద్ధి చేసి, పూలమాలలు వేసి భక్తిపూర్వకంగా అర్చించారు.

Ghantasala Fans Tribute: ఘంటసాల అభిమానికి ఘన సత్కారం..

ఈ సందర్భంగా ఘంటసాల అపర అభిమాని అయిన వెంకట్రావును రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఘంటసాల భౌతికంగా మనకు దూరమైనా ఆయన పాడిన పాటలు, పద్యాలు ప్రతి తెలుగు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. భావితరాలకు ఆయన సంగీత వారసత్వాన్ని, జ్ఞాపకాలను అందించడానికే ప్రతి నెల ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సంస్మరణ పూజా కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ తో పాటు సంస్థ సభ్యులు, ప్రముఖులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు. అలాగే ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలే జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీచర్ తిరుమలయ్య, గోవిందు, పురోహితుడు సురేష్ స్వామి, తులసి రామ్ నాయుడు, రామకృష్ణ మొదలియార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గానగంధర్వునికి పుష్పాంజలి సమర్పించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha