VB-G RAM-G scheme: తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన పథకం 'VB-G RAM-G' (విబి-జి రామ్-జి) ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు.
ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారు.

read also: AP EAPCET 2026 Rank : రాష్ట్రస్థాయిలో 183వ ర్యాంక్ సాధించిన విద్యార్థి
రూ.312కు పెరిగిన దినసరి కూలి.. 125 రోజులకు పనిదినాల పెంపు
ఈ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి కూలీలకు భారీ లబ్ధి చేకూరనుంది. ‘VB-G RAM-G’ స్కీమ్ కింద పనిచేసే కూలీల దినసరి వేతనాన్ని రోజుకు రూ. 312 కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఏడాదిలో కల్పించే కనీస ఉపాధి పనిదినాలను గతంలో ఉన్న పరిమితి కంటే పెంచి, ఇప్పుడు 125 రోజులకు పొడిగించారు. ఈ నిర్ణయంపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు.. ఫొటో గ్యాలరీ సందర్శన
పథకం ప్రారంభోత్సవానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి సభా ప్రాంగణ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం, గ్రామీణ పరిశుభ్రత కోసం ఉద్దేశించిన ‘స్వచ్ఛ రథాలు’, భూగర్భ జలాల పెంపునకు తోడ్పడే ‘మ్యాజిక్ డ్రైన్ల’ పనితీరును నేతలు స్వయంగా పరిశీలించారు. అలాగే, నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ఫొటో గ్యాలరీని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
Epaper: epaper.vaartha.com
దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

