YS Jagan Vijayawada visit: విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో తమ పార్టీ క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన క్రాంతి కుమార్.. అక్కడ మాజీ సీఐగా పనిచేసిన నాగరాజు వేధింపులు తాళలేకనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. తన చావుకు కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు మాత్రమే కారణమని, ఆయన వేధింపుల వల్లే తాను ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ వీడియోలో క్రాంతి కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: Chandrababu Gudur Speech: రాష్ట్రాభివృద్ధే లక్ష్యం:సీఎం
YS Jagan consoles the family of Dalit youth Kranthi Kumar.
YS Jagan Vijayawada visit: పోలీసుల తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ప్రశ్నలు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ స్థానిక పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రాంతి కుమార్ స్పష్టంగా రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ.. పోలీసులు దానిని ఎందుకు ‘మరణ వాంగ్మూలం’ గా పరిగణించడం లేదని ఆయన నిలదీశారు. నిందితుడైన మాజీ సీఐ నాగరాజుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, దళిత యువకుడి మృతికి న్యాయం చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
Epaper: epaper.vaartha.com

