Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్‌పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్‌పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

వార్త 12 hrs ago

MK Stalin: తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయ్ తీరుపై డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.

స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కేంద్రంలోని బీజేపీకి ‘జిరాక్స్ కాపీ’లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు అన్నాడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

 Stalin Comments on Vijay

read also:Supriya Sule: కాంగ్రెస్‌లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే

ఇతర రాష్ట్రాల బీజేపీ ఫార్ములానే తమిళనాడులో అమలు!

చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం నిర్వహించిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో ఎం.కె. స్టాలిన్ ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి బీజేపీ ఎలాంటి అప్రజాస్వామిక వ్యూహాలను అమలు చేస్తోందో, ఇప్పుడు తమిళనాడులో సీఎం విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అధికార పార్టీ ‘షాపింగ్’ కు తెరలేపిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి కనీసం మూడు వారాలు (21 రోజులు) కూడా కాకముందే, ఓటర్ల వేలి సిరా గుర్తు కూడా చెరగకముందే నలుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు టీవీకే గూటికి చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. వారికి ఎలాంటి ఆఫర్లు ఇచ్చి పార్టీలోకి లాక్కున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

MK Stalin: సొంత పార్టీ మహిళలకే రక్షణ లేదు: స్టాలిన్ అభ్యంతరం

రాష్ట్రంలో మహిళా భద్రత పూర్తిగా క్షీణించిందని స్టాలిన్ ఆరోపించారు. ఇటీవల శ్రీవైకుంఠంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు నిందితులు కూడా అధికార టీవీకే పార్టీకి చెందినవారేనని స్పష్టం చేశారు. కనీసం నిందితులపై చర్యలు తీసుకోకపోగా, బాధితురాలినే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే శ్రేణుల నుంచే మహిళలకు రక్షణ కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వాన్ని కూల్చడం మా పని కాదు

గతంలో టీవీకే ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించారని స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇప్పటివరకు వేచి చూశానని, అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మౌనంగా ఉండలేకపోతున్నానని అన్నారు. అధికార పీఠాన్ని కూల్చడం తమ ఉద్దేశం కాదని, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై డీఎంకే ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మహిళా కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

TMCలో కీలక పరిణామం !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha