Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తీవ్ర ఒత్తిడితో బిల్డింగ్ పైనుంచి దూకి మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య!

తీవ్ర ఒత్తిడితో బిల్డింగ్ పైనుంచి దూకి మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య!

వార్త 2 weeks ago

NEET Student Suicide: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న 'నీట్' (NEET) పరీక్ష వివాదాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పరీక్షల రద్దు, పేపర్ లీకేజీ, రీ-ఎగ్జామ్ భయాల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఒక మెడికల్ అభ్యర్థిని బలవన్మరణానికి పాల్పడింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన అవంతిక మౌర్య (21) అనే విద్యార్థిని గురువారం రాత్రి తాను ఉంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. భవనం పైనుంచి కిందపడిన అవంతిక తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తక్షణమే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది.

Read Also : 'Abused'at Kerala Worship Centre : కేరళలోని ఒక ప్రార్థనా కేంద్రంలో పిల్లలపై వేధింపులు

 Another NEET student commits suicide by jumping off a building due to severe stress!

NEET Student Suicide: ఇప్పటికే మూడుసార్లు పరీక్ష రాసిన అవంతిక

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అవంతికకు ఎలాగైనా మెడిసిన్ సీటు సాధించాలనే బలమైన కోరిక ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే మూడుసార్లు నీట్ పరీక్ష రాసింది. ఈ ఏడాది మంచి మార్కులు వస్తాయని ఆశించిన తరుణంలో, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాలు, పరీక్ష రద్దు కావడం, తిరిగి పరీక్షలు నిర్వహిస్తారనే వార్తలు ఆమెను తీవ్రంగా కలచివేసాయి. నీట్ పరీక్షపై రోజుకో వివాదం తెరపైకి రావడం, రీ-ఎగ్జామ్ అని తెలియడంతో అవంతిక గత కొన్ని రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్లు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ చెప్పారు. ఆందోళన కారణంగా ఆమె సరిగా తిండి కూడా తినడం లేదని, చివరికి ఆ మానసిక సంఘర్షణ భరించలేకే బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha