Bengaluru Crime: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ్యామోహం ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకుంది. భార్య రీల్స్ చూస్తూ ఇంట్లో సకాలంలో వంట చేయడం లేదనే చిన్న కోపంతో, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఈ ఘోర ఘటన బెంగళూరు నగరం పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఈ హత్యోదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Read Also :Himachal Bus Accident:ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం!

ప్రేమ వివాహం నుంచి క్రూరమైన ముగింపు వరకు
బీహార్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ కుమార్ (24), రీమా కుమారి (20) కొద్ది కాలం క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వచ్చి నివాసముంటున్నారు. ధీరజ్ చిన్న చిన్న పనులు చేస్తుండగా, రీమా కుమారి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రీమా కుమారి ఖాళీ సమయంలో నిరంతరం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండేది. దీనివల్ల ఆమె ఇంట్లో సరిగా వంట చేయకపోవడం, ఇంటి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 27న ఇద్దరి మధ్యా మళ్లీ గొడవ జరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన ధీరజ్ కుమార్, కట్టుకున్న భార్య రీమా కుమారి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పరుపులో చుట్టి వేసి, ఇంటికి తాళం వేసి తన స్వగ్రామమైన బీహార్‌కు పారిపోయాడు.
Bengaluru Crime: వెలుగులోకి వచ్చిందిలా..
రీమా కుమారి వరుసగా ఆఫీసుకు రాకపోవడం, ఎంత ఫోన్ చేసినా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సహచర ఉద్యోగులు (స్నేహితురాళ్లు) ఆమె నివాసానికి వెళ్లారు. అక్కడ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, పరుపులో చుట్టి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న రీమా కుమారి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు, బీహార్‌కు పారిపోయిన నిందితుడు ధీరజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్య రీల్స్ పిచ్చి, ప్రవర్తన నచ్చకపోవడం వల్లే ఆవేశంలో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
ORR వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

