Akividu Ramalayam: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత నాయస్థానం కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో ఆకివీడు రామాలయ నిర్మాణానికి ఇన్నాళ్లుగా ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
Read Also :SC On Paper Leak Protests : శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Akividu Ramalayam: సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యాంశాలు

రామాలయ నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ వేసిన వ్యతిరేక పిటిషన్‌లో తగిన ఆధారాలు లేకపోవడంతో దానిని కొట్టివేసింది. ఈ నిర్మాణంపై ఏవైనా స్పష్టమైన సందేహాలు లేదా బలమైన కొత్త ఆధారాలు ఉంటే భవిష్యత్తులో వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆకివీడు స్థానిక ప్రజలు, శ్రీరామ భక్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

