Razor Movie Collections: ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, 'రేజర్' సినిమాను సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. రవిబాబు తన సొంత బ్యానర్ 'ఫ్లయింగ్ ఫ్రాగ్స్'పై ఈ చిత్రాన్ని నిర్మించగా, సురేష్ ప్రొడక్షన్స్ దీనికి వెన్నుదన్నుగా నిలిచింది.
ట్రేడ్ లెక్కల ప్రకారం, ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే (Break-even) సుమారు 9 కోట్ల షేర్, అంటే దాదాపు 17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.
Read Also:Razor Movie Review: రవిబాబు 'రేజర్' మూవీ రివ్యూ

కథా నేపథ్యం
రవిబాబు ఈసారి ఒక డిఫరెంట్ పొలిటికల్ రివేంజ్ డ్రామాను ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి కూతురిని ఆమె ప్రత్యర్థుల నుండి కాపాడే ఒక సామాన్యుడి పాత్రలో రవిబాబు స్వయంగా నటించారు. హోంమంత్రి మరియు అతని కొడుకు నుండి ఎదురయ్యే సవాళ్లను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఈ కథలో ‘రేజర్’ ప్రాధాన్యత ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రణవి మానుకొండ, నాజర్, తనీష్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.
Razor Movie Collections: తొలిరోజు వసూళ్ల అంచనా
రవిబాబు వినూత్నమైన ఇంటర్వ్యూలు మరియు పాడ్‌కాస్ట్‌ల ద్వారా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. బుక్ మై షో (BookMyShow) గణాంకాల ప్రకారం, విడుదల రోజున 1.1కే టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెద్ద సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. విశ్లేషకుల అంచనా ప్రకారం, తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్‌లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

