Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి పిటిషన్‌ విచారణ వాయిదా

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి పిటిషన్‌ విచారణ వాయిదా

వార్త 1 week ago

Trainee IPS Uday Krishna Reddy: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన వ్యవహారంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భద్రత నడుమ ఆయనను న్యాయస్థానానికి తరలించారు.

Read Also : Rythu bharosa telangana: రైతుభరోసా కొత్త దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్

 Hearing on Trainee IPS officer Uday Krishna Reddy’s petition adjourned.

Trainee IPS Uday Krishna Reddy: అశోక్‌నగర్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్

కోర్టులో హాజరుపరచడానికి ముందు, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఉదయం సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు. అందుకోసం ఉదయ్ కృష్ణారెడ్డిని అశోక్‌నగర్‌లోని ఆయన అద్దె గదికి తీసుకెళ్లి, ఘటన జరిగిన స్థలాన్ని మరియు పరిసరాలను నిశితంగా పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించారు.

విచారణ సందర్భంగా ఈ కేసులోని బాధితురాలికి ముందస్తు నోటీసులు జారీ చేయాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పీపీ వాదనలను విన్న కోర్టు, బాధితురాలికి తక్షణమే నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

హైడ్రాను కొనసాగిస్తాం..హైకోర్టు తీర్పుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha