Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రైనీ IPS ఉదయ్ విచారణలో షాకింగ్ విషయాలు

ట్రైనీ IPS ఉదయ్ విచారణలో షాకింగ్ విషయాలు

వార్త 2 weeks ago

Trainee IPS officer Uday Krishna Reddy : లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలతో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసు విచారణలో వెల్లడించిన విషయాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

యూపీఎస్సీ సాధించి సివిల్ సర్వెంట్‌గా మారిన తర్వాత సోషల్ మీడియాలో తనకు వేలాదిమంది అభిమానులు ఏర్పడ్డారని, ఆ క్రమంలోనే కొందరు మహిళలు తనకు ప్రపోజ్ చేయగా తాను అంగీకరించానని ఆయన విచారణాధికారులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తానొక ఉన్నతాధికారి హోదాలో ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ‘మహిళలు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పడంలో తప్పేముంది?’ అని సమర్థించుకునేలా మాట్లాడటం పోలీసు వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది.

Read ALso : తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు

హోదా దుర్వినియోగం మరియు చట్టపరమైన చిక్కులు

సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి కష్టపడి ఐపీఎస్ స్థాయికి ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి, ఆ ప్రజాదరణను మరియు తన హోదాను వ్యక్తిగత ఆకర్షణలకు వాడటం క్షమించరాని నేరమని పలువురు న్యాయకోవిదులు, పౌరసమాజ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, సోషల్ మీడియా వేదికగా ఇతర మహిళలపై సాగించిన మానసిక, లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయన బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయి. రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ఐపీఎస్ పదవిలో ఉంటూ ఇటువంటి ప్రవర్తనను ప్రదర్శించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని, చట్టపరంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.

ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha