Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

వార్త 2 weeks ago

Secunderabad Railway Station:తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రయాణ కేంద్రం. ఈ కీలక స్టేషన్‌ను రూ.714.73 కోట్ల భారీ వ్యయంతో విమానాశ్రయం తరహాలో అత్యాధునిక వసతులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించే లక్ష్యంతో ఆధునిక హంగులతో కూడిన ఈ పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో దాదాపు 65 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.

Read also: Revanth Reddy Foreign Tour: సీఎం రేవంత్‌ రెడ్డికి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు షరతులు!

 The new look of Secunderabad Railway Station

అత్యాధునిక వసతులు ప్రత్యేకతలు

ఈ ప్రాజెక్టులో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎన్నో అధునిక సదుపాయాలను నిపుణులు రూపకల్పన చేశారు. ప్రధానంగా రెండు అంతస్తుల విశాలమైన ఎయిర్ కాంకోర్స్, ప్రయాణికులను ఆకట్టుకునే ఆధునిక రూఫ్ టాప్‌లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వాహనాల నిలిపివేత కోసం ప్రత్యేకంగా మల్టీ-లెవెల్ పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రాకపోకలు సులభతరం చేయడానికి 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు అలాగే ట్రావలేటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. మెట్రో రైలు సేవలను సులభంగా అనుసంధానించడానికి ప్రత్యేకంగా స్కైవాక్‌లను నిర్మిస్తున్నారు.

Secunderabad Railway Station:పర్యావరణ హితం సాంకేతికత

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఈ ఆధునిక స్టేషన్‌లో పలు హరిత చర్యలు చేపట్టారు. విద్యుత్ అవసరాల కోసం భారీ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంచుతున్నారు. మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీ ప్లాంటును సైతం నిర్మించారు. ఈ సమగ్ర అభివృద్ధి చర్యల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయి.

Epaper: epaper.vaartha.com

హైదరాబాదీలకు గుడ్ న్యూస్: రోడ్డుపైకి 100 కొత్త ఆర్టీసీ మినీ బస్సులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha