Dailyhunt
ట్రక్కు-కారు భీకరంగా ఢీకొని ఏడుగురు మృతి.. సురేంద్రనగర్‌లో విషాదం!

ట్రక్కు-కారు భీకరంగా ఢీకొని ఏడుగురు మృతి.. సురేంద్రనగర్‌లో విషాదం!

వార్త 1 week ago

Gujarat Road Accident: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అదుపు తప్పిన ట్రక్కు వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సురేంద్రనగర్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also :Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం!

 Gujarat Road Accident: Seven killed in a horrific truck-car collision.. Tragedy in Surendranagar!

నుజ్జునుజ్జైన కారు.. మృతదేహాల వెలికితీత కష్టం

ట్రక్కు ఢీకొన్న వేగానికి కారు పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. ఘటన తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు కారు శిథిలాల్లో ఇరుక్కుపోయాయి. పోలీసులు, స్థానికులు గ్యాస్ కట్టర్ల సహాయంతో వాహన భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీయడానికి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారా లేక స్నేహితులా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Gujarat Road Accident: అతివేగమే ప్రమాదానికి కారణం?

ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఘోర ప్రమాదం.. కుప్పలుగా మృతదేహాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha