Dailyhunt
ట్రంప్ బెదిరింపులకు భయపడం..దాడులు కొనసాగుతాయ్

ట్రంప్ బెదిరింపులకు భయపడం..దాడులు కొనసాగుతాయ్

వార్త 4 days ago

ర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్​ తోసిపుచ్చింది.

ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు తమపై ఎలాంటి ప్రభావం చూపవని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు వారి సైనిక వైఫల్యాల ఫలితం. అవి మా దాడులను ఆపలేవు. పశ్చిమాసియాలో అమెరికా ఎదుర్కొన్న అవమానాన్ని కూడా చెరపలేవు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్​ (ఐఆర్​జీసీ) నౌకాదళం ఇజ్రాయెల్‌కు చెందిన కంటైనర్ నౌకపై క్షిపణి దాడి చేసింది. దీంతో అది ధ్వంసమై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలాగే టెల్ అవీవ్, హైఫా, బీర్ షెవా వంటి ప్రాంతాల్లో కీలక లక్ష్యాలను బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అమెరికా కూడా చెందిన నౌక ఎల్​హెచ్​ఏ-7 కూడా దాడులకు గురై, మహాసముద్రంలోనే వెనుదిగాల్సి వచ్చింది.కువైట్‌లోని అమెరికా స్థావరాలు, బగ్దాద్‌లోని కమాండ్ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి’ అని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతిని తెలిపారు.

Read Also: Iran Attack : అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ పై ఇరాన్ దాడి

 Iran-America War

Iran-USA War: ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ

ఇదిలా ఉండగా, ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క రాత్రిలోనే మొత్తం దేశాన్ని నాశనం చేయగలం అంటూ వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ కేంద్రాలు, వంతెనలు ధ్వంసం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. గత కొన్ని వారాల్లో అమెరికా వైమానిక దళం ఇరాన్‌పై 10 వేలకుపైగా యుద్ధ విమాన దాడులు జరిపి, 13 వేలకుపైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌ భూభాగంలో F-15 పైలట్‌ కోసం అమెరికా సైన్యం చేపట్టిన అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ విజయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని కాపాడటం కోసం 200 మంది సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారని తెలిపారు. సైనిక ఆపరేషన్ల గురించి ఎవరో లీక్‌ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. గల్లంతైన పైలట్‌ను కాపాడేందుకు వెళ్లిన ఆపరేషన్‌ గురించి కూడా వార్తలు రాసి పైలట్‌ సహా వందల మంది అమెరికా సైనికుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల తమ దేశంపై బాంబులు వేయాలని ఇరాన్‌ ప్రజలే స్వయంగా తమను కోరుతున్నారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటల్లోపు అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఐదున్నర గంటల వరకు ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ మొత్తం ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha