Dailyhunt
ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం

ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం

వార్త 3 weeks ago

ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఒక్క రాత్రిలోనే ఇరాన్ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌లో కూలిపోయిన అమెరికా ఎఫ్-15 విమాన సిబ్బందిలో ఒకరిని విజయవంతంగా రక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చారిత్రాత్మక రెస్క్యూ ఆపరేషన్

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ట్రంప్ "చారిత్రాత్మకం"గా అభివర్ణించారు. మొత్తం 155 విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు. వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా, వారిని తప్పుదోవ పట్టించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశామని చెప్పారు.

Read Also:Chandrababu Warning : అధికారులకు క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు

 Donald Trump

మీడియా లీక్‌పై ట్రంప్ ఆగ్రహం

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారం కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేశాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ లీక్ వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. లీక్‌కు కారణమైన వ్యక్తిని తప్పకుండా పట్టుకుంటామని, అవసరమైతే మీడియా సంస్థలను కూడా చట్టపరంగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు.. కేంద్రం అధికారిక గెజిట్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha