Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్‌ నిర్ణయాల్లో స్థిరత్వం లేదు: ఇరాన్

ట్రంప్‌ నిర్ణయాల్లో స్థిరత్వం లేదు: ఇరాన్

వార్త 2 months ago

Iran vs USA War: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా గనుక భూతల దాడులకు (Ground Operations) దిగితే, ఆ దేశ సైనికులు సముద్రంలోని 'షార్క్ చేపలకు ఆహారంగా' మారుతారని ఇరాన్ అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించింది.

ఇరాన్ సాయుధ దళాలకు చెందిన ‘ఖతం అల్-అన్బియా’ సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జొల్ఫకరి విడుదల చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read Also:Iran War:యుద్ధానికి బ్రేక్ పడేనా? ఇస్లామాబాద్‌లో ముమ్మరమైన తెర వెనుక దౌత్యం!

Iran vs USA War: “క్షణాలను లెక్కిస్తున్నాం”: ఇరాన్ సైన్యం సిద్ధం

అమెరికా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ధీటుగా బదులిచ్చేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని, అందుకు తాము “క్షణాలను లెక్కిస్తున్నామని” జొల్ఫకరి స్పష్టం చేశారు. “ఇస్లాం యోధులు అటువంటి చర్యల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆక్రమణదారులు అవమానకరమైన ఓటమిని చవిచూడక తప్పదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.

 Brigadier General Ibrahim Zolfaghari

ఈ సందర్భంగా జొల్ఫకరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ట్రంప్‌ను ప్రపంచంలోనే “అత్యంత అబద్ధాలకోరు అధ్యక్షుడు” అని అభివర్ణించారు. “ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారు, మరుసటి గంటలోనే యుద్ధం అంటారు. ఆయన నిర్ణయాల్లో స్థిరత్వం లేదు” అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జెఫ్రీ ఎప్స్టీన్ కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో ఉన్న సంబంధాల కారణంగా ట్రంప్ ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొస్సాద్’ ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఇజ్రాయెల్ ప్రధానికి ఆయన ఒక “పావు”గా మారారని జొల్ఫకరి ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇరాన్ మిస్సైల్ దాడి.. అమెరికా అవాక్స్ విమానం ధ్వంసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha