అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తీసుకుంటున్న యుద్ధ నిర్ణయాలు, అధిక సుంకాలు మరియు ఆర్థిక విధానాలపై అమెరికన్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
వాషింగ్టన్ డిసితో పాటు అమెరికా అంతటా నిరసనలు మిన్నంటుతున్నాయి. వాషింగ్టన్‌లోని ప్రసిద్ధ నేషనల్ మాల్, లింకన్ మెమోరియల్ వద్ద నిరసనకారులు ఒక వినూత్న శిల్పాన్ని ఏర్పాటు చేశారు. 10 అడుగుల మార్బుల్ సింహసనంపై 'గోల్డెన్ టాయిలెట్' ఏర్పాటు చేసి, దానిపై ట్రంప్ కూర్చున్నట్లుగా రూపొందించిన ఈ శిల్పం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. "రాజుకు తగిన సింహాసనం" (A Throne Fit for a King) అనే పేరుతో ట్రంప్ వైఖరిని ఎద్దేవా చేస్తూ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.
Golden Toilet
Golden Toilet: వైట్ హౌస్ రెనోవేషన్‌పై ఆగ్రహం
ఒకవైపు దేశం యుద్ధ వాతావరణంలో, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, మరోవైపు వైట్ హౌస్ పునరుద్ధరణ (Renovation) కోసం భారీగా నిధులు కేటాయించడంపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. విలాసాల కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శిస్తూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. చారిత్రాత్మక ప్రదర్శనలు: 90 లక్షల మంది నిరసన
అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసనగా రికార్డులకు ఎక్కింది. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో దాదాపు 3,000 ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రదర్శనలు జరిగాయి. నినాదం: "నో కింగ్స్" (మాకు రాజులు వద్దు) అనే నినాదంతో సుమారు 90 లక్షల మంది ప్రజలు తమ అసమ్మతిని తెలియజేశారు.ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ దేశాలపై విధిస్తున్న అధిక సుంకాలు అమెరికన్ల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో అధ్యక్షుడిని ఒక రాజులా కాకుండా, ప్రజల సేవకుడిలా చూడాలని అమెరికన్లు కోరుతున్నారు. ఈ 'గోల్డెన్ టాయిలెట్' నిరసన ట్రంప్ పరిపాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

