భారీగా తగ్గిన బంగారం ధర
Gold price 18/04/26 : పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గాయి.
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1250 తగ్గి రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా రూ.1370 తగ్గి తులానికి రూ.1,54,200గా నమోదైంది.
వెండి ధరలు స్థిరంగా
బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం పెద్దగా మారలేదు. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజుల్లో వెండి ధరలు వరుసగా పెరిగినప్పటికీ ప్రస్తుతం అవి స్థిరంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : Para Boiled Rice Procurement: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి!
Gold price 18/04/26ట్రంప్ ప్రకటనల ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండగా మరోవైపు గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4830 డాలర్ల నుంచి 4790 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ కూడా కొంత పుంజుకోవడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

