Dailyhunt
ట్రంప్ శాంతి ప్రణాళిక 15 పాయింట్లు

ట్రంప్ శాంతి ప్రణాళిక 15 పాయింట్లు

వార్త 3 weeks ago

Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా ముందడుగు వేసింది. ఇరాన్‌తో వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం 15 ప్రధానాంశాలతో కూడిన కాల్పుల విరమణ శాంతి ఒప్పందాన్ని సిద్ధం చేసింది.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ కీలక ప్రణాళికను ఇరాన్ అధికారులకు చేరవేసినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి.

Read Also : Crude Oil Crisis: భారత రిఫైనరీ కంపెనీలకు రష్యా 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

 Trump’s peace plan has 15 points

Donald Trump: 15 పాయింట్ల ప్రణాళికలో ఉన్న కఠిన షరతులు

అమెరికా ప్రతిపాదించిన ఈ ప్రణాళికలో ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతపై అత్యంత కఠినమైన నిబంధనలు.

  • అణు కేంద్రాల మూసివేత: ఇరాన్‌లోని అత్యంత కీలకమైన నటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలని అమెరికా డిమాండ్ చేసింది.
  • యురేనియం శుద్ధిపై నిషేధం: ఇరాన్ తన భూభాగంపై ఎలాంటి యురేనియం శుద్ధి ప్రక్రియను చేపట్టకూడదు.
  • అంతర్జాతీయ పర్యవేక్షణ: అణు కేంద్రాలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)కు పూర్తి స్థాయి తనిఖీ అధికారాలు కల్పించాలి.
  • క్షిపణుల తయారీ నిలిపివేత: బాలిస్టిక్ క్షిపణుల తయారీ మరియు ప్రయోగాలను తక్షణమే నిలిపివేయాలి.
  • సాయుధ గ్రూపులకు మద్దతు ఉపసంహరణ: వివిధ దేశాల్లోని సాయుధ బృందాలకు నిధులు, ఆయుధాలు, శిక్షణ ఇవ్వడం ఆపేయాలి.
  • హార్మూజ్ జలసంధి: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది.

ప్రతిగా అమెరికా ఇచ్చే హామీలు

ఇరాన్ ఈ షరతులకు అంగీకరిస్తే.. అంతర్జాతీయ సమాజం ఆ దేశంపై విధించిన అణు సంబంధిత ఆంక్షలు అన్నింటినీ ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఇరాన్ శాంతియుత పౌర అణు అవసరాలకు అమెరికా స్వయంగా సహాయం చేయడమే కాకుండా పర్యవేక్షణ బాధ్యతను కూడా తీసుకుంటుందని చెప్పింది. ముఖ్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా ఆంక్షలు అమలులోకి వచ్చే స్నాప్‌బ్యాక్ మెకానిజంను కూడా రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రంప్.. “యుద్ధం గెలిచాం”

వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌పై అమెరికా ఇప్పటికే విజయం సాధించిందని, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదన్నదే తమ ప్రధాన లక్ష్యమని, దానికి వారు సూత్రప్రాయంగా అంగీకరించారని ఆయన తెలిపారు. అయితే, ఈ శాంతి ప్రణాళికపై ఇజ్రాయెల్ స్పందన మరియు ఇరాన్ అధికారిక నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఒప్పందం గనుక కుదిరితే పశ్చిమాసియా రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha