అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ అత్యంత కఠినమైన రీతిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దౌత్యపరమైన హద్దులు దాటి యుద్ధం దిశగా వెళ్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అమెరికా నుండి వెలువడిన తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమెరికాతో పరోక్షంగా జరుగుతున్న ‘థర్డ్ పార్టీ’ (మూడో దేశం ద్వారా) చర్చలను ఇరాన్ పూర్తిగా నిలిపివేసినట్లు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. ట్రంప్ వ్యాఖ్యలు చర్చలకు తావులేని విధంగా ఉన్నాయని, ఇకపై కేవలం పోరాటమే మార్గమని ఇరాన్ సంకేతాలిచ్చింది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య ఉన్న అతికొద్ది దౌత్య మార్గాలు కూడా మూసుకుపోవడంతో, రానున్న గంటల్లో యుద్ధం తప్పదా అనే భయాందోళనలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి.
Read Also : NTR-NEEL Dragon Shooting Stopped: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్ ?

‘కోలుకోలేని దెబ్బ తగులుతుంది’.. ఎంబసీల ఘాటు స్పందన!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు (Embassies) ట్రంప్ వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా సౌతాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ స్పందిస్తూ.. “ట్రంప్ హెచ్చరికలు కేవలం ఇరాన్‌కే పరిమితం కావు, దీనివల్ల అమెరికా మరియు దాని మిత్రదేశాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది” అని హెచ్చరించింది. అగ్రరాజ్యం తన దుందుడుకు చర్యలతో ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడేస్తోందని, దానికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేయవద్దని, ఎదురుదాడికి తాము సర్వసిద్ధంగా ఉన్నామని ఈ ప్రకటనల ద్వారా తెలియజేసింది.
‘సైకోపాత్ బెదిరింపులు మాకేం చేయవు’.. తుర్కియేలో ఆగ్రహం!
ట్రంప్ వైఖరిపై తుర్కియేలోని ఇరాన్ ఎంబసీ మరింత తీవ్రంగా స్పందించింది. ట్రంప్‌ను ఒక ‘సైకోపాత్’ (ఉన్మాది) గా అభివర్ణిస్తూ, అటువంటి వ్యక్తి చేసే బెదిరింపులకు ఇరాన్ భయపడదని తేల్చి చెప్పింది. శతాబ్దాలుగా ఎన్నో విదేశీ దాడులను, కాలం పెట్టిన పరీక్షలను తట్టుకుని నిలబడిన బలమైన దేశం ఇరాన్ అని, ఒక వ్యక్తి చేసే అహంకారపూరిత వ్యాఖ్యలు దేశ ఉనికిని మార్చలేవని ఫైర్ అయింది. కేవలం మాటలతో యుద్ధం చేసే స్థాయి నుండి, ఇరు దేశాలు ఆయుధాలతో తలపడే స్థాయికి చేరువవ్వడం ప్రపంచ ఆర్థిక మరియు భద్రతా వ్యవస్థలను అతలాకుతలం చేసేలా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నానంటూ వ్యంగ్యంగా కామెంట్స్

