Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం: కాగ్నిజెంట్‌కు PERM షాక్

ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం: కాగ్నిజెంట్‌కు PERM షాక్

వార్త 1 week ago

US Suspends Cognizant Green Card : అమెరికాలో ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు అత్యంత కీలకమైన గ్రీన్ కార్డ్ ప్రక్రియపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) తో పాటు క్లౌడెరా (Cloudera) సంస్థలకు చెందిన ‘శాశ్వత లేబర్ సర్టిఫికేషన్’ (PERM) ఫైలింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించారు. అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్ కార్డ్) పొందడానికి ఉద్యోగ ఆధారిత వలస విధానంలో PERM (Program Electronic Review Management) మొదటి మెట్టు. ఒక విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే ముందు, ఆ నిర్దిష్ట ఉద్యోగానికి తగిన అర్హత కలిగిన అమెరికా పౌరులు ఎవరూ అందుబాటులో లేరని కంపెనీ నిరూపించాలి. విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల స్థానిక అమెరికన్ల వేతనాలు లేదా పని పరిస్థితులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకూడదు.

Read Also: Donald Trump: అణ్వాయుధం విషయంలో ఇరాన్‌కు ఛాన్స్ లేదు: ట్రంప్

 US Suspends Cognizant Green Card

US Suspends Cognizant Green Card : దర్యాప్తు వివరాలు - మోసాలపై కఠిన చర్యలు

H-1B మరియు PERM వీసా నిబంధనల ఉల్లంఘనలపై ట్రంప్ యంత్రాంగం వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలసి ఉమ్మడి దర్యాప్తు చేపట్టింది. “అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. నిజాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. అక్రమాలకు పాల్పడిన వారికి సంకెళ్లు తప్పవు” అని ఆంథోనీ డి’ఎస్పోసిటో ‘X’ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు కాగ్నిజెంట్ కొత్తగా ఎవరికీ PERM దరఖాస్తులను సమర్పించలేదు.1994లో చెన్నైలో ప్రారంభమై, ప్రస్తుతం న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్‌లో అధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వందలాది మంది భారతీయ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

మోసం ఆరోపణలపై పెద్ద స్థాయి దర్యాప్తు

ట్రంప్‌ ప్రభుత్వం వీసా కార్యక్రమాల్లో అక్రమాలు, మోసాలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. జులైలోనే H-1B, PERM ఉపాధి వీసా కార్యక్రమాలకు సంబంధించిన మోసం ఆరోపణలపై పెద్ద స్థాయి దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్‌ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్‌, క్లౌడెరాపై తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. కాగ్నిజెంట్‌ సంస్థను 1994లో చెన్నైలో స్థాపించారు. ప్రస్తుతం సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం టీనెక్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలను అందిస్తున్న ఈ సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు.

బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ - పుతిన్ భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha