Triumph Tiger 1200: ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ 'ట్రయంఫ్' (Triumph), తన ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరర్ బైక్ 'టైగర్ 1200'ను 2027 మోడల్‌గా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది.
మునుపటి మోడల్‌తో పోలిస్తే మరింత శక్తివంతమైన ఇంజన్, రాడార్ ఆధారిత అత్యాధునిక రైడర్ సేఫ్టీ ఫీచర్లు, బైక్ ఆగినప్పుడు సీటు ఎత్తును దానంతట అదే తగ్గించుకునే వినూత్న సస్పెన్షన్ సిస్టమ్‌తో ఈ బైక్‌ను గ్రాండ్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కొత్త మోడల్ 2027 మార్చి నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
Container Manufacturing: కంటైనర్ తయారీ రంగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
'Triumph 1200' - an all-new bike featuring radar technology and a powerful engine
Triumph Tiger 1200: 156 bhp పవర్‌తో మెరుగైన ఇంజన్ అప్‌గ్రేడ్స్
ఈ బైక్‌లోని 1,160 సీసీ లిక్విడ్-కూల్డ్ ట్రిపుల్ ఇంజన్‌ను కంపెనీ గణనీయంగా మెరుగుపరిచింది. ఇది ఇప్పుడు 9,250 rpm వద్ద 156 bhp శక్తిని, 6,750 rpm వద్ద 130 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే 7 bhp శక్తి అధికం కాగా, తక్కువ ఆర్‌పీఎం వద్దనే ఎక్కువ టార్క్ అందుబాటులోకి వస్తుంది. ఇంజన్‌లో సిలిండర్ హెడ్, పిస్టన్లు, ఎగ్జాస్ట్, ఫ్యూయల్ ఇంజెక్షన్, గేర్‌బాక్స్ వంటి అనేక భాగాలలో మార్పులు చేసి అత్యుత్తమ పనితీరును సాధించారు.
ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణ రాడార్ ఆధారిత టెక్నాలజీ. ముందు, వెనుక అమర్చిన రాడార్ల సాయంతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ అసిస్ట్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు పనిచేస్తాయి. అంతేకాకుండా అన్ని వేరియంట్లలో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల టీఎఫ్‌టీ (TFT) టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అమర్చారు.
ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్‌మెంట్
షోవా (Showa) సెమీ-యాక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ దీని మరో ముఖ్యమైన ప్రత్యేకత. ఇందులో అమర్చిన 'రైడ్-హైట్ ఫంక్షన్' అడ్వెంచర్ రైడర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా బైక్ ఆగి ఉన్నప్పుడు సీటు ఎత్తు సుమారు 30 మి.మీ. వరకు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. దీంతో పొట్టిగా ఉన్న రైడర్లు కూడా సులభంగా బైక్‌ను నియంత్రించవచ్చు. అదనపు ఆప్షన్‌గా లభించే 'లో సీట్' అమర్చుకుంటే సీటు ఎత్తును 790 మి.మీ. వరకు తగ్గించుకునే వీలుంది.
భారత్‌లో విడుదల కానున్న వేరియంట్లు & పోటీ
భారత మార్కెట్లో ట్రయంఫ్ రెండు వేరియంట్లను విడుదల చేయనుంది. అవి: 'జీటీ ప్రో' (20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, కాస్ట్ వీల్స్), 'ర్యాలీ ఎక్స్‌ప్లోరర్' (30 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, స్పోక్డ్ వీల్స్). ఈ రెండు వేరియంట్లలో రైడర్, పిలియన్ కోసం హీటెడ్ సీట్లు, 3-స్టేజ్ హీటెడ్ గ్రిప్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. డిజైన్‌లో భాగంగా ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ బీక్, విండ్‌స్క్రీన్‌లలో స్వల్ప మార్పులు చేశారు. మార్కెట్లో వీటి ధరలను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ మోడల్ 'బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ అడ్వెంచర్' వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Epaper: epaper.vaartha.com

