Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రోలింగ్ పేరుతో వేధింపులు.. కఠిన చర్యలు కోరిన రియా అహిర్

ట్రోలింగ్ పేరుతో వేధింపులు.. కఠిన చర్యలు కోరిన రియా అహిర్

వార్త 1 day ago

Riya Ahir: విద్యా వ్యవస్థలోని లోపాలు మరియు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో ముంబైలోని దాదర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మోడల్ రియా అహిర్ పాల్గొన్నారు.

ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్న విద్యార్థుల వ్యాన్‌కు ఎదురుగా చేతులు చాపి ఆమె అడ్డుగా నిలబడ్డారు. ఈ సాహసోపేతమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రియా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులు, పోలీసుల తీరుపై ఆవేదన

వైరల్ ఘటన తర్వాత తాను తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని రియా అహిర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టారు. తనను కేవలం “వైరల్ గర్ల్”గా కాకుండా, 20 మంది విద్యార్థులను అక్రమ నిర్బంధం నుంచి కాపాడిన సాహస వనితగా గుర్తుంచుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి మామూలు ట్రోలింగ్ కాదని, కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. జులై 27న ఫిర్యాదు చేసినా ఆగస్టు 5 వరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని వాపోయారు.

Riya Ahir: రియా అహిర్‌కు రాహుల్ గాంధీ అండగా నిలుస్తామని భరోసా

ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గళమెత్తడం ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం కాదని స్పష్టం చేశారు. రియా అహిర్ ప్రదర్శించిన ధైర్యానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha