Ananya Nagalla: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రూ. 390కే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందించే 'సబ్‌స్క్రిప్షన్' ఫీచర్‌ను ఆమె ప్రారంభించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, సందేహాలపై అనన్య తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
అభిమానులకు దగ్గరవ్వడానికే..
A surprise awaits if you chant the name of Shiva for 21 days.
ఈ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను కేవలం డబ్బు కోసం కాకుండా, తన అభిమానులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే ఎంచుకున్నట్లు అనన్య తెలిపారు. తన జీవితంలో జరిగే విశేషాలను పంచుకోవడానికి, అలాగే సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. కేవలం హైప్ పెంచుకోవడానికే ఇలా చేస్తున్నారన్న వాదనలను ఆమె తోసిపుచ్చారు.
Ananya Nagalla: ఆధ్యాత్మికతతో కూడిన సర్‌ప్రైజ్
అనన్య తన సబ్‌స్క్రైబర్ల కోసం ఒక వినూత్నమైన ఆలోచనను పంచుకున్నారు. “సాధారణంగా రోజుకు 108 సార్లు ‘ఓం నమః శివాయ’ జపాన్ని 21 రోజుల పాటు చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. అందుకే, 21 రోజుల పాటు ఈ నామస్మరణ చేసే వారికోసం ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను” అని ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయం ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై వస్తున్న రకరకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వృత్తిపరంగా చూస్తే.. అనన్య ఇటీవల ‘పొట్టెల్’, ‘డార్లింగ్’, ‘తంత్ర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. టాలీవుడ్‌లో ఎదుగుతున్న నటీమణులలో ఆమె ఒకరిగా నిలుస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

