Dailyhunt
Trump: భారత్-అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

Trump: భారత్-అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

వార్త 2 months ago

నెలల తరబడి సాగిన చర్చల అనంతరం భారత్-అమెరికా(India-America) వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒకే అయింది. ఈ ఒప్పందం ప్రారంభ దశ నుంచే దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ముఖ్యంగా, అమెరికా ప్రభుత్వం భారతదేశ వ్యవసాయం, పాడి రంగాలను పూర్తిగా తెరవాలని డిమాండ్ చేయడం రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, భారతదేశం కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను క్రమంగా తగ్గించి, కొన్ని ఉత్పత్తులపై సున్నా సుంక విధానం అమలు చేసే దిశగా ముందుకు వెళ్తుందని తెలిపారు.

రోలిన్స్ తెలిపిన వివరాల ప్రకారం..

అయితే, ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలు పూర్తిగా తెరుచుకుంటాయా లేదా అనే అంశంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. కానీ అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ చేసిన ప్రకటన మాత్రం భారతదేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడం ద్వారా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలోని భారీ మార్కెట్‌కు చేరుతాయని.. ఇది గ్రామీణ అమెరికాకు భారీ ఆర్థిక లాభాలను తీసుకువస్తుందని X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రోలిన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 2024 నాటికి భారతదేశంతో అమెరికా వ్యవసాయ వాణిజ్య లోటు 1.3 బిలియన్ డాలర్లకు చేరనుంది.

భారత రైతులకు సాంకేతికంగా ప్రయోజనం

అమెరికా ఉత్పత్తులతో పాటు.. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు కూడా భారతదేశానికి దిగుమతి కావచ్చు. ఇది భారత రైతులకు సాంకేతికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ, తక్కువ ధరల అమెరికన్ ఉత్పత్తులతో పోటీ పడాల్సి రావడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ వస్తువులపై సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించడం వల్ల భారతీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోతారని కాంగ్రెస్ హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

International Trade: రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha