Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీతంపేట మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి

సీతంపేట మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి

వార్త 1 month ago

Sithampeta Road Accident: సీతంపేట దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో జంపర్ కోట గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు మృతి చెందారు.

దీంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. రాయకురిడి గ్రామంలో జరిగే గ్రామ దేవత పండగలకు వీరంతా ఆటో ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా సీతంపేట సమీపం ఒకటో గేడ్డ మలుపు వద్ద ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి సంఘటనలో జంపర్ కోటకు చెందిన జీలకర్ర మోహన్ రావు (60) జీలకర్ర వరలక్ష్మి ద్విచక్ర వాహన పై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

Read Also:AP 10th Results: 6వ తరగతిలో ఆగిపోయిన చదువు.. ఇప్పుడు కొడుకుతో కలిసి టెన్త్ పాసైన తల్లి!

Sithampeta Road Accident: రంగంలోకి దిగిన పోలీసులు

ఈ ప్రమాదంలో మోహన్ రావు తలకు బలమైన గాయం తగలడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. వరలక్ష్మి స్వల్ప గాయం తగలడంతో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య నిమిత్తం శ్రీకాకుళం రీమిక్స్ కు తరలించారు. దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జంపర్ కోట గ్రామానికి చెందిన ప్రయాణికుల ఆటోలో రాయకురిడి గ్రామ దేవత ఉత్సవాలు వచ్చి తిరిగి ప్రయాణంలో జంపర్ కోట ఘాట్ రోడ్లో ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో కొండ గొర్రె శ్రావణి ఊలక శాంతి.

 Sithampeta Ghat Road Accident

హారిక భూలక్ష్మి తో పాటు ఆటో డ్రైవర్ హక్కు పల్లి రవణ సంఘటనా స్థలంలో మృతిచెందగా. మల్లమ్మకు తీవ్ర గాయాలు తగలడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇది ఆటోలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉండడం వారికి స్వల్ప గాయాలు తగిలాయి ఈ సంఘటనపై సీతంపేట ఎస్సై వై. అమ్మన్నారావు దోనుబయ ఎస్ఐ శంకర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన తెలుసుకున్న పాలకొండ డి.ఎస్.పి రాంబాబు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

85.25 శాతంతో అదరగొట్టిన విద్యార్థులు - చంద్రబాబు అభినందనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha