DGP Shivadhar Reddy Visit: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో బుధవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మరియు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి.
సుధీర్ బాబు సంయుక్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. కార్యాలయంలో కొనసాగుతున్న సివిల్ పనులు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటును అధికారులు స్వయంగా పరిశీలించారు.
Read Also: Macherla Rape Case Updates: ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం.. నిందితుడు ప్రియుడే!
ఈ భవనం సాధారణ కార్యాలయం కాకుండా అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన స్మార్ట్ కార్యాలయంగా రూపుదిద్దుకోవాలని, పోలీస్ సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూరేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కార్యాలయాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం ఫ్యాబ్ సిటీలోని తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించిన అధికారులు, భవిష్యత్ విస్తరణ అవసరాల దృష్ట్యా మీర్ ఖాన్‌పేట్ వద్ద ప్రభుత్వం కేటాయించిన స్థలాలను సందర్శించారు. ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన మాస్టర్ ప్లాన్‌పై అధికారులతో సమగ్రంగా చర్చించారు. త్వరలోనే తుక్కుగూడ నుంచి పూర్తి స్థాయి పోలీస్ సేవలు ప్రారంభమవుతాయని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

