Tuni: కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం కారణంగా అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రైళ్లు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లూప్ లైన్‌లోకి వెళ్తుండగా ప్రమాదం
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ గూడ్స్ రైలు, తుని దాటిన తర్వాత లూప్ లైన్‌లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో రైలుకు చెందిన ఒక బోగీ అదుపుతప్పి పట్టాల నుంచి పక్కకు పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పాటు ఎవరికీ గాయాలు కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Tuni: ఆలస్యంగా నడుస్తున్న ప్రముఖ రైళ్లు
ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో ఈ కింది రైళ్ల షెడ్యూల్‌కు ఆటంకం కలిగింది. విశాఖపట్నం – మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం – సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్, ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైలు బోగీని తొలగించి, ట్రాక్‌ను పునరుద్ధరించే పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టారు.
చంద్రబాబుపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు.. జగన్‌పై ప్రశంసలు

